Friday 18th October 2024
12:07:03 PM
Home > క్రీడలు > Ind Vs Aus: కుప్పకూలిన టీమిండియా.. 109 రన్స్ కే ఆలౌట్!

Ind Vs Aus: కుప్పకూలిన టీమిండియా.. 109 రన్స్ కే ఆలౌట్!

ind vs aus

Ind Vs Aus 3rd Test | భారత్‌ – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టులో టీమిండియా పేవల ప్రదర్శన కనబరిచింది. ఆసీస్ స్పిన్నర్ల ధాటికి కేవలం 109 పరుగులకే కుప్పకూలింది.

ఆస్ట్రేలియా బౌలర్‌ కుహ్నెమన్‌ ఐదు వికెట్లు తీయగా, నాథన్‌ లయాన్‌ 3, మర్ఫీ 1 వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు టాస్‌ గెలిచిన రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. పిచ్‌ మొదటి నుంచి స్పిన్నర్లకు అనుకూలించింది. దీంతో భారత బ్యాటర్లు పరుగులు తీసేందుకు చాలా ఇబ్బంది పడ్డారు.

27 పరుగుల వద్దే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (12) కుహ్నెమన్‌ బౌలింగ్‌లో స్టాంపౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే శుభ్‌మన్‌ గిల్‌ (21) క్యాచ్‌ అవుట్‌ తో వెనుదిరిగాడు.

Read Also: BRSకి చేతకాదు.. బీజేపీ అధికారంలోకి రాగానే వారి అంతు చూస్తాం: బండి

అనంతరం కేవలం రెండు పరుగుల వ్యవధిలోనే టెస్ట్‌ స్పెషలిస్ట్‌ చటేశ్వర్‌ పుజారా (1) నాథన్‌ లయాన్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.

ఆ తర్వాత వరుసగా రవీంద్ర జడేజా(4), శ్రేయాస్‌ అయ్యర్‌ (0), విరాట్‌ కోహ్లీ (22), శ్రీకర్‌ భరత్‌ (17) , రవిచంద్రన్‌ అశ్విన్‌ (3), ఉమేశ్‌యాదవ్‌ (17), సిరాజ్‌(0)లు వెనువెంటన్‌ ఇలా వచ్చి అలా పెవిలియన్‌ బాట పట్టారు. అక్షర్‌ పటేల్‌ (12) నాటౌట్‌గా నిలిచాడు.

భారత బ్యాట్స్‌మెన్లలో కోహ్లీ (22)దే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.
నిలకడగా ఆడుతున్న ఆసీస్‌
టీమిండియా ఆలౌట్ అయిన వెంటనే బ్యాటింగ్ కు దిగిన ఆసీస్‌ జట్టు తన తొలి ఇన్నింగ్స్ ని నిలకడగా ప్రారంభించింది.

ఆరంభంలోనే ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ (9) వికెట్‌ను కోల్పోయినప్పటికీ, ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్‌ ఖవాజా, మార్నస్‌ లబుషేన్‌ ఆచితూచి ఆడుతున్నారు.

భారత బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ ఒక వికెట్‌ తీసుకున్నాడు.

Read Also: గ్యాస్ వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన సిలిండర్ ధర!
పుజారా చెత్త రికార్డు
ఈ మ్యాచ్‌లో భాగంగా నాలుగు బంతులు ఎదుర్కొన్న భారత టెస్ట్ స్పెషలిస్ట్ పుజారా లియోన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలోనే అతడు తన పేరిట ఒక చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.

ఒకే బౌలర్‌ చేతిలో ఎక్కువసార్లు ఔటైన బ్యాట్స్‌మెన్‌గా జాబితాలో చేరాడు. పుజారాను నాథన్‌ లియోన్‌ ఔట్‌ చేయడం ఇది 12వ సారి.

ఇంగ్లండ్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ కూడా పుజారాను 12 సార్లు అవుట్ చేశాడు. ఇంతకుముందు అండర్‌వుడ్ చేతిలో సునీల్ గవాస్కర్ 12 సార్లు ఔట్ అవ్వగా, ఆ రికార్డను పుజారా అధిగమించినట్లయింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions