Hyderabad Police launch ‘Operation Kavach’ | హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేసే దిశగా శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి ‘ఆపరేషన్ కవచ్’ (Operation Kavach) పేరుతో నగరవ్యాప్తంగా పోలీసులు విస్తృతమైన నాకాబందీని నిర్వహించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని రీతిలో చేపట్టిన ఈ కార్యక్రమంలో దాదాపు 5,000 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఏకకాలంలో 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు.
ఈ ప్రత్యేక డ్రైవ్‌లో లా అండ్ ఆర్డర్ (Law & Order), ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్ విభాగాలతో పాటు ఆర్మ్‌డ్ రిజర్వ్, బ్లూ కోల్ట్స్ మరియు పెట్రోలింగ్ బృందాలు సంయుక్తంగా పాల్గొన్నాయి. ప్రజా భద్రత కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో నగర పౌరులందరూ పోలీసులకు పూర్తి సహకారం అందించాలని హైదరాబాద్ సీపీ సజ్జనర్ కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్ 100 కు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల భద్రత – తమ బాధ్యత అని సజ్జనర్ స్పష్టం చేశారు.










