Hyderabad police launch C-Mitra to enable cybercrime FIRs from home | సైబర్ నేర బాధితులకు తెలంగాణ పోలీసులు శుభవార్త అందించారు. ఇకపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ‘C-Mitra’ ద్వారా సైబర్ క్రైమ్ FIR నమోదు చేయొచ్చు. డిజిటల్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు, ఫిర్యాదు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఈ వినూత్న ప్రయత్నం చేపట్టారు పోలీసులు.
సైబర్ క్రైం బాధితులకు అండగా నిలుస్తూ, వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లే శ్రమ లేకుండా త్వరితగతిన న్యాయం అందించేందుకు దేశంలోనే తొలిసారిగా ‘సీ-మిత్ర’ (C-Mitra) అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్. సీ-మిత్ర ద్వారా ఫిర్యాదు చేయడం మొదలుకొని, ఎఫ్ఐఆర్ నమోదు అయ్యే వరకూ అంతా ఇంటి నుంచే పూర్తవుతుందన్నారు. కృత్రిమ మేధ (AI) సహకారంతో వర్చువల్ హెల్ప్‌డెస్క్ ద్వారా ఫిర్యాదు ప్రక్రియ సులభతరం కానుందని వెల్లడించారు.








