Wednesday 9th July 2025
12:07:03 PM
Home > తాజా > హైదరాబాద్ కొత్త సీపీ బాధ్యతల స్వీకరణ.. ఫ్రెండ్లీ పోలీసింగ్ పై కీలక వ్యాఖ్యలు!

హైదరాబాద్ కొత్త సీపీ బాధ్యతల స్వీకరణ.. ఫ్రెండ్లీ పోలీసింగ్ పై కీలక వ్యాఖ్యలు!

cp hyderabad

Hydrabad New CP | హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి (Kothakota Srinivas Reddy) బాధ్యతలు స్వీకరించారు. ఈయన గతంలో గ్రే హౌండ్స్, ఆక్టోఫస్‌లో పనిచేశారు.  బుధవారం ఉదయం రోడ్ నెంబర్ 12 లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీపీ శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

తన  శక్తి సామర్థ్యాలు గురించి సీపీ గా బాధ్యతలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ మహా నగరం లో డ్రగ్స్, జూదం ను నిర్ములిస్తానని హామీ ఇచ్చారు.

“ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా మీడియా ఉంటుంది. ప్రజాభిప్రాయాన్ని మాకు మీ మీడియా ద్వారా తెలియజేయాలని కోరుతున్నాను. మెట్రో పాలిటీన్ సిటిలో మూడు అంశాలపై అలెర్ట్ గా ఉండాలి. సంఘటన జరిగినప్పుడు పోలీస్ క్విక్ రెస్పాన్స్ అనేది చాలా ప్రధానం.

మహిళలపై వేధింపులు, ర్యాగింగ్ లపై కూడా షీ టీమ్స్ ద్వారా మరింత పని తీరు ను మెరుగు పరుస్తాం. తెలంగాణా స్టేట్ తో పాటు హైదరాబాద్ ను డ్రగ్ ఫ్రీ సిటీ గా తీర్చి దిద్దాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్ తో పాటు సైబరాబాద్, రాచకొండ కమిషనర్లతో కూడా సమన్వయం చేసుకొని ముందుకు పోతాం. 

డ్రగ్స్ ఫ్రీ సిటీ గా తీర్చిదిద్దాడమే మా లక్ష్యంగా ముందు కు పోతాం. గతంలో డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపారు. డ్రగ్స్ ముఠాలను హెచ్చరిస్తున్నాను. హైదరాబాద్ , తెలంగాణా ను డ్రగ్స్ ముఠాలు వదిలి వెళ్ళాలి, లేక పోతే ఉక్కుపాదం మోపుతాం.

సినీ ఇండస్ట్రీలో కూడా డ్రగ్స్ సేవిస్తున్నట్లు గుర్తించాం. మీరు మారక పోతే సినీ ఇండస్ట్రీ లో ఉన్న వారిపై కూడా ఉక్కుపాదం మోపుతాం. సినీ పెద్దలతో త్వరలో మీటింగ్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తాం. పబ్స్, రెస్టారెంట్లపై నిఘా ఉంటుంది.

ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఈ మధ్య అవహేళనకు గురైంది. అందరితో ఫ్రెండ్లీగా ఉండడం నష్టమే. చట్టం గౌరవించే వారితో మేం ఫ్రెండ్లీ గానే ఉంటాం. కానీ చట్టాలను ఉల్లంగిస్తే మాత్రం కఠినంగా ఉంటాం అని హెచ్చరించారు సీపీ శ్రీనివాస్ రెడ్డి.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions