Thursday 21st November 2024
12:07:03 PM
Home > తాజా > ఖమ్మంలో అకాల వర్షాలు..అమిత్ షాకు పరిస్థితిని వివరించిన బండి

ఖమ్మంలో అకాల వర్షాలు..అమిత్ షాకు పరిస్థితిని వివరించిన బండి

Heavy Rains In Khammam | తెలంగాణ రాష్ట్రంలో రెండురోజులుగా ఎడతెరుపులేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం ( Khammam ) జిల్లాలో వరదలు ఉదృతంగా మారాయి.

ఈ నేపథ్యంలో ఖమ్మంలో నెలకొన్న పరిస్థితిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( Home Minister Amit Shah ) కు వివరించారు కేంద్ర సహాయక శాఖామంత్రి బండి సంజయ్ ( Bandi Sanjay ).

ఖమ్మంలో తీవ్ర పరిస్థితి మరియు జిల్లాలో 110 గ్రామాలు మునిగిపోయాయని, ప్రకాష్ నగర్ గుట్టపై 9 మంది, పాలేరు నియోజకవర్గంలోని అజ్మీరా తండా కొండపై 68 మంది, 42 మంది చిక్కుకుపోయారని కేంద్ర హోంమంత్రి కి బండి సంజయ్ తెలియజేసారు.

ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి ఆదేశాల మేరకు చెన్నై, విశాఖపట్నం, అస్సాం నుంచి మూడు చొప్పున 9 ఎన్‌డిఆర్‌ఎఫ్ ( NDRF ) బృందాలను తెలంగాణకు పంపించినట్లు చెప్పారు.

అలాగే, మంత్రి పొంగులేటి ( Ponguleti Srinivas Reddy )తో పరిస్థితి మరియు కొనసాగుతున్న సహాయక చర్యలపై కేంద్ర హోంమంత్రి చర్చించినట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టాయని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions