Saturday 3rd May 2025
12:07:03 PM
Home > తాజా > ‘ఆ ఇందిరమ్మకే తెలియాలి’

‘ఆ ఇందిరమ్మకే తెలియాలి’

Harish Rao Fires On Cm Revanth Reddy | పథకాల అమలులో ఎన్ని సార్లు మాట మార్చుతారు, ఎన్ని సార్లు ప్రజలను మోసం చేస్తారు అంటూ ప్రభుత్వం పై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు.

మాట తప్పడం – మడమ తిప్పడం..ఇదేనా కాంగ్రెస్ మార్కు పాలన అని ఎద్దేవా చేశారు. Dec 9, 2023 కు రుణమాఫీ, ఆగస్ట్ 15, 2024 వరకు రుణమాఫీ, దసరా వరకు రుణమాఫీ అని ప్రభుత్వం చెప్పిందని కానీ నేటికీ 20 లక్షల పైచిలుకు రైతులకు రుణమాఫీ అందలేదన్నారు.

రైతు బంధు విషయంలో కూడా ఇప్పుడు తీసుకుంటే 10 వేలు, డిసెంబర్ 9, 2023 తర్వాత తీసుకుంటే రైతు భరోసా 15 వేలు అంటూ మాటలు చెప్పారని కానీ వానకాలం రైతు భరోసా ఎగవేసారు, యాసంగి భరోసా సంక్రాంతికి ఇస్తాం అన్నరని ధ్వజమెత్తారు.

మాట మార్చి 26 జనవరికి అన్నరు, ఇప్పుడు మార్చి 31 వరకు అంటున్నరని అసహనం వ్యక్తపరిచారు. కేసీఆర్ రైతు బంధు ఇచ్చి రైతన్నకు దన్నుగా నిలిస్తే, దాన్ని ఎగ్గొట్టి రేవంత్ రెడ్డి రైతులకు భరోసా లేకుండా చేసిండని మండిపడ్డారు.

ఆసరా 4 వేలు, తులం బంగారం, మహిళలకి 2,500, విద్యా భరోసా కార్డు, ఏడాది లో 2 లక్షల ఉద్యోగాలు,
నిరుద్యోగ భృతి ఇవన్నీ ఇందిరమ్మ రాజ్యంలో ఏమయ్యాయో ఆ ఇందిరమ్మకే తెలియాలి అంటూ హరీష్ రావు ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు.

You may also like
‘స్కూటీ దొంగిలించిన ఎద్దు’
‘ఇదేం పైత్యం..చనిపోయిన పోప్ అవతారంలో ట్రంప్’
‘వరకట్నం వద్దేవద్దు..రూ.31 లక్షలని తిరిగిచ్చేసిన వరుడు’
‘అవ్‌నీత్ కౌర్ ఫొటోకు లైక్..క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions