Gold Prices Hit Record High | భారతదేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర అక్షరాల రూ.లక్షకు చేరింది. దేశంలో ఈ మార్కును అందుకోవడం ఇదే తొలిసారి.
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, మాంద్యం భయాలతో మదుపర్లు బంగారం వైపు చూస్తున్నారు. అలాగే అమెరికా-చైనాల మధ్య టారిఫుల పోరు, డాలర్ బలహీన పడడం వంటివి కూడా ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్థిరమైన పెట్టుబడిగా బంగారం కొనుగోల్లు పెరిగాయి.
దింతో ఇంటర్నేషనల్ మార్కెట్లలో ఔన్సు బంగారం విలువ సోమవారం నాటికి 3405 డాలర్లకు చేరింది. దీనిని అనుసరించి దేశీయా మార్కెట్లలో సోమవారం సాయంత్రం 5.30 నిమిషాల సమయానికి 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.లక్ష 16 పెరిగింది.
గత శుక్రవారం తో పోలిస్తే ఏకంగా రూ.2 వేలు పెరిగింది. 31 డిసెంబర్ 2024లో పసిడి ధర రూ.79 వేలు ఉండగా, ఈ ఏడాది ఇప్పటికే రూ.20వేలు పెరిగింది. మరోవైపు వెండి ధర కూడా కిలోకు అటూఇటుగా రూ.లక్ష వద్ద కొనసాగుతుంది.