Tuesday 3rd December 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అదానీపై అమెరికాలో కేసు..షేర్లు డమాల్ !

అదానీపై అమెరికాలో కేసు..షేర్లు డమాల్ !

Gautam Adani Charged By USA In Bribery Case | ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ పై అమెరికాలో కేసు నమోదవ్వడంతో అదానీ గ్రూప్ షేర్లు డమాల్ అయ్యాయి.

భారత్ లో ఓ భారీ సోలార్ ప్రాజెక్టు ( Solar Project ) దక్కించుకునేందుకు గౌతమ్ అదాని మరో ఏడుగురితో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికాలోని ఎఫ్బీఐ ( FBI ) ఆరోపించింది.

కాంట్రాక్ట్ పొందేందుకు 265 మిలియన్ డాలర్లు అంటే రూ.2029 కోట్ల ఇవ్వడానికి ప్రయత్నించినట్లు అమెరికా బ్రుక్లిన్ లోని ఫెడరల్ కోర్టు అభియోగాలు మోపింది. బ్యాంకులకు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు ప్రయత్నించినట్లు అభియోగాలు వస్తున్నాయి.

ఇందులో అమెరికన్ ఇన్వెస్టర్లు ( Investors ) కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో అదానీ పై కేసు నమోదయింది. న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ( Newyork Eastern District ) అటార్నీ ఆదేశాల మేరకు మొత్తం ఐదు అభియోగలతో గౌతమ్ అదాని తో సహా ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో గురువారం మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లో అదాని గ్రూప్ షేర్లు ( Adani Group Shares ) భారీగా పతనమయ్యాయి.

You may also like
తాను ఆహుతై..తెలంగాణకు వేగుచుక్కై
పుష్ప-3 కూడా ఉంది..ఫోటో వైరల్
ఛత్రపతి శివాజీ మహారాజ్ గా రిషబ్ శెట్టి
చంద్రబాబు గారు..రైతులను రోడ్డున పడేశావ్ : జగన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions