Saturday 28th February 2026
12:07:03 PM
Home > తాజా > జూబ్లీహిల్స్ లో సమంత, రకుల్ కు ఓటు..క్లారిటీ!

జూబ్లీహిల్స్ లో సమంత, రకుల్ కు ఓటు..క్లారిటీ!

Fake Voter ID Cards OF Actresses Found | బీఆరెస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చిన విషయం తెల్సిందే. నవంబర్ 11న ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచార జోరును పెంచాయి.

ఇదే సమయంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సమంత, తమన్నా భాటియా, రకుల్ ప్రీత్ సింగ్ కు జూబ్లీహిల్స్ లో ఓట్లు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు వీటికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే ఈ ప్రచారం ఫేక్ అని తేలిపోయింది. ఇతరుల ఎపిక్ నంబర్ పై హీరోయిన్ల ఫోటోలు జత చేసి కొందరు ఇలా తప్పుడు ఓటర్ కార్డులను సృష్టించినట్లు తెలుస్తోంది.

హీరోయిన్ల పేర్లపై ఓటర్ కార్డులు వైరల్ గా మారడం పట్ల హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు అందింది. వీటిని ఎవరు ఫ్యాబ్రికేట్ చేశారు, ఎవరు ప్రచారం చేశారు అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతుంది.

You may also like
ఇరాన్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..ఏం జరగనుందో!
GHMC చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం
బల్కంపేట ఆలయంలో మంత్రి ఆకస్మిక తనిఖీ..అధికారులపై వేటు
బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్..స్పందించిన పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions