ED notice to Mahesh Babu in money laundering case | నటుడు మహేష్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 27న విచారణకు హాజరవ్వాలని అందులో పేర్కొంది.
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న సూరానా గ్రూప్, సాయిసూర్య డెవలపర్స్ కు సంబంధించిన వాణిజ్య ప్రకటనల్లో మహేష్ బాబు నటించారు. అయితే ప్రకటనలో కోసం రూ.5.9 కోట్లు మహేష్ బాబు పారితోషకం తీసుకున్నారు.
కానీ ఇందులో రూ.3.4 కోట్లు చెక్కు రూపంలో తీసుకోగా, మరో రూ.2.5 కోట్లను నగదు రూపంలో తీసుకున్నట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఇది మనీ లాండరింగ్ కిందకు వస్తుందని పేర్కొంది. సురానా డెవలపర్స్, సాయి సూర్య డెవలపర్స్ పై ఇటీవల జరిగిన ఈడీ రైడ్స్ లో ఆధారాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు.
మహేష్ బాబు చేసిన ప్రకటనలను చూసి, ఈ రియల్ ఎస్టేట్ సంస్థలో అక్రమాలు జరుగుతున్నాయి అని తెలియక అనేకమంది పెట్టుబడులు పెట్టారని ఈడీ పేర్కొంది. రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమాలలో ఎలాంటి భాగస్వామ్యం లేనప్పటికీ, డబ్బును అక్రమమైన పద్ధతిలో స్వీకరించినందుకు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.