Did Ram Charan unfollow Thaman on social media | మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను గ్లోబల్ స్టార్ రాంచరణ్ సోషల్ మీడియాలో అన్ ఫాలో అయ్యారని గత రెండ్రోజులుగా ప్రచారం జరుగుతుంది.
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న తమన్ ‘గేమ్ చేంజర్’ ( Game Changer ) పాటలు యూట్యూబ్ లో ఎందుకు హిట్ అవ్వలేదో వివరించారు. మూవీ పాటల్లో దేంట్లో కూడా ఒక్క హుక్ స్టెప్ కూడా లేదన్నారు. ఈ కారణంగానే పాటలకు వ్యూస్ రాలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో తమన్ పై రాం చరణ్ సీరియస్ అయినట్లు సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేశారు. అంతేకాకుండా ఈ కారణంతోనే చరణ్ తమన్ ను అన్ ఫాలో అయ్యారని ప్రచారం జరిగింది. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని రాంచరణ్ టీం స్పష్టం చేసింది.
రాంచరణ్ కేవలం కుటుంబ సభ్యుల్ని, అత్యంత సన్నిహితులను మాత్రమే ఫాలో అవుతున్నారని, తమన్ ను అన్ ఫాలో అయినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని నటుడి టీం పేర్కొంది.