Monday 12th May 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ

ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ

Deputy Cm Pawan Kalyan Meets Pm Modi | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) ఢిల్లీ పర్యటన బిజీ బిజీ గడుస్తుంది.

వరుసగా కేంద్రమంత్రులను కలిసిన పవన్ బుధవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఢిల్లీలో ప్రధానిని పవన్ తొలిసారి కలిశారు. పార్లమెంటు బిల్డింగ్ ( Parliament Building ) లోని పీఎం కార్యాలయంలో ప్రధానితో డిప్యూటీ సీఎం సమావేశం అయ్యారు.

ఈ భేటీలో జనసేన ఎంపీలు వల్లభనేని బలశౌరి, ఉదయ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలు చర్చించారు. ముఖ్యంగా జల జీవన్ మిషన్ అమలులో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అలాగే పథకం కాలపరిమితిని పెంచాలని డిప్యూటీ సీఎం ప్రధానితో చర్చించారు.

You may also like
మృణాల్ ఠాకూర్ తో పెళ్లి..స్పందించిన నటుడు
‘ఆడవారి సింధూరాన్ని తుడిచారు..అందుకే’
‘మురళీనాయక్ లాంటి వీరులను కన్న తల్లులకు మదర్స్ డే అంకితం’
‘ఆపరేషన్ సింధూర్’ కొనసాగుతుంది..IAF కీలక ప్రకటన

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions