Dammunte Pattukora Shekhawat Song Release | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Icon Star Allu Arjun ) కథానాయకుడిగా డిసెంబర్ 5న విడుదలైన ‘పుష్ప-2 ది రూల్’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్స్ ఆఫీస్ ( Box Office ) వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది.
తాజగా ఈ మూవీ నుండి మరో క్రేజీ సాంగ్ ఆన్లైన్ ( Online ) లో రిలీజ్ అయింది. ‘దమ్ముంటే పట్టుకోరా షేకావత్..పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్’ అంటూ అల్లు అర్జున్ చేసిన హంగామా అంతాఇంతా కాదు.
ఈ పాట ఇన్ని రోజులు కేవలం థియేటర్లలోనే వినిపించింది. అయితే మంగళవారం ఈ పాటను టి-సిరీస్ ఆన్లైన్ లో విడుదల చేసింది. ఈ పాటకు థమన్ మ్యూజిక్ అందించగా, స్వయంగా అల్లు అర్జునే గాత్రం అందించారు. మరోవైపు దర్శకుడు సుకుమార్ ( Sukumar ) లిరిక్స్ సమకూర్చారు.