Saturday 28th February 2026
12:07:03 PM
Home > తాజా > మైనర్లతో ఇంటర్వ్యూ..వారికి సజ్జనర్ వార్నింగ్

మైనర్లతో ఇంటర్వ్యూ..వారికి సజ్జనర్ వార్నింగ్

CP Sajjanar News | తెలుగులోని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మైనర్లతో ఇంటర్వ్యూలు చేస్తూ, లైవ్ లోనే అసభ్యకరమైన కంటెంట్ ను ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనర్ స్పందించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు యాంకర్ సంతోష్, సత్యమూర్తి కే చేసిన ఇంటర్వ్యూ వీడియోలను సజ్జనర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసి హెచ్చరికలు జారీ చేశారు.

వ్యూస్ మాయలో విలువలు మరిచిపోతే ఎలా అని ప్రశ్నించారు. వ్యూస్, లైక్స్ తో పాటు సోషల్ మీడియాలో మీరు ఫేమస్ కావడానికి చిన్నారుల భవిష్యత్ ను పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం అని యాంకర్లను నిలదీశారు. వారితో అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని కన్నెర్ర చేశారు. చిన్నారులకు, యువతకి స్పూర్తినిచ్చే, ఆదర్శంగా నిలిచే వ్యక్తులను ఇంటర్వ్యూలు చేసి.. సమజాభివృద్దికి దోహదం చేయండి.. అంతేకానీ ఇలాంటి వీడియోలు వారితో చేసి పిల్లలను పెడదోవ పట్టించొద్దని సూచనలు చేశారు.

ఇది బాలల హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదని క్షమార్హం.. చట్టరీత్యా నేరం అని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు POCSO యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ వంటి చట్టాలను ఉల్లంఘించడమే అని స్పష్టం చేశారు. పిల్లలను ఇలాంటి కంటెంట్‌లో భాగం చేయడం చైల్డ్ ఎక్స్‌ప్లాయిటేషనే అవుతుందన్నారు. తక్షణమే వీటిని తొలగించకున్నా..భవిష్యత్ లో ఇలాంటి కంటెంట్ అప్లోడ్ చేసిన చట్టప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందని అల్టీమేటం జారీ చేశారు.

You may also like
ఇరాన్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..ఏం జరగనుందో!
GHMC చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం
బల్కంపేట ఆలయంలో మంత్రి ఆకస్మిక తనిఖీ..అధికారులపై వేటు
బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్..స్పందించిన పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions