Congress MLA Vemula Veeresham | నకిరేకల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత వేముల వీరేశం (Vemula Veeresham) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినా తన గెలుపును ఆపలేకపోయారని తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంలో కేటీఆర్ (KTR) పాత్ర ఉందన్నారు. బతుకుమీద ఆశ లేదా అని గతంలో తనను కేటీఆర్ బెదిరించినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా టేబుల్ మీద వెపన్ పెట్టి ప్రభాకర్ తనను బెదిరించే ప్రయత్నం చేసినట్లు చెప్పుకొచ్చారు.
వికారాబాద్ జిల్లా లగచర్ల (Lagacharla) గ్రామంలో అధికారులపై జరిగిన దాడి ఉదంతంలో కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించారు. బీఆరెస్ కార్యకర్త సురేష్ కాల్ రికార్డింగ్ తో కేటీఆర్ బండారం బయటపడిందన్నారు. వెంటనే కేటీఆర్ ను అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.