Congress Bjp Alliance In Aliabad Municipality | తెలంగాణ మున్సిపాలిటీల ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలో చిత్ర విచిత్ర పొత్తులు కుదురుతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రత్యర్థి పార్టీలు, నిత్యం విమర్శలు చేసుకునే కాంగ్రెస్, బీజేపీ ఓ మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడం కోసం ఏకం అవ్వడం ఆసక్తిగా మారింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని అలియాబాద్ మున్సిపాలిటీలో ఈ వింత పొత్తు కుదిరింది.
మొత్తం 20 వార్డులున్న ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ 8, బీఆరెస్ 7, బీజేపీ 3, ఇతరులు రెండు స్థానాల్లో గెలిచారు. ఛైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్, బీఆరెస్ తీవ్రంగా శ్రమించాయి. అయితే మంగళవారం జరిగిన ఛైర్ పర్సన్ ఎన్నికలో బీజేపీ, ఇతరులు మద్దతు తెలపడంతో ఈ మున్సిపాలిటీ హస్త గతం అయ్యింది. దింతో మున్సిపల్ ఛైర్ పర్సన్ గా కాంగ్రెస్ కు చెందిన కంఠం శిరీష ఎన్నికయ్యారు.










