CM Revanth Reddy Serious on Police Over Handcuffing to Farmer | హీర్యా నాయక్ అనే రైతుకు బేడీలు వేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్నెర్ర చేశారు.
వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో అధికారులపై దాడి జరిగిన కేసులో గత నెల రోజులుగా సుమారు 45 మంది సంగారెడ్డి జైలులో ఉన్నారు. అయితే ఇందులో హీర్యా నాయక్ అనే రైతుకు గుండె నొప్పి వచ్చింది.
దింతో పోలీసులు రైతుకు బేడీలు వేసి సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. దింతో పోలీసుల తీరుపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం స్పందించారు.
హీర్యా నాయక్‌ను చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి బేడీలతో తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ఘటనపై అధికారుల నుంచి వివరాలను ఆరా తీసిన ముఖ్యమంత్రి రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఘటనపై పూర్తి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని సీఎం రేవంత్ హెచ్చరించారు.