Cm Revanth Reddy News Latest | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఢిల్లీలో పర్యటించిన రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.
అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాళేశ్వరంపై పిటిషన్ వేసిన రాజలింగ మూర్తి హత్యకు గురయ్యాడు, కేసు వాదించిన సంజీవ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందారు, కేటీఆర్ వ్యాపార భాగస్వామి కేదార్ దుబాయ్ లో అనుమానాస్పదంగా మరణించారని సీఎం పేర్కొన్నారు.
ర్యాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో కేదార్ కీలక నిందితుడిని, కానీ ఈ మరణాలపై కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్. జ్యుడీషియల్ విచారణ ఎందుకు కోరడం లేదన్నారు. కాంగ్రెస్ కు పేరు వస్తుందనే దురుద్దేశ్యం తో ఎస్ఎల్బీసీ ( SLBC ) పనులను కేసీఆర్ చేయలేదని ఆరోపించారు.
కాంగ్రెస్ వచ్చాకే పనులు తిరిగి ప్రారంభమయ్యాయని తెలిపారు. సొరంగం వద్ద జరిగిందని ప్రమాదమని, అక్కడ చిక్కుకున్నవారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.









