CM Revanth Reddy felicitates Tilak Varma for Asia Cup performance | ఆసియా కప్-2025 లో పాకిస్థాన్ తో జరిగిన తుది పోరులో కీలక ఇన్నింగ్స్ ఆడిన బ్యాటర్ తిలక్ వర్మ టీం ఇండియాను విజయ తీరాలకు చేర్చారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
తాజగా హైదరాబాద్ చేరుకున్న తిలక్ వర్మ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. భారత జట్టును విజేతగా నిలపడంలో తిలక్ వర్మ అత్యుత్తమ ప్రతిభను కనబరిచారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.
ఈ సందర్భంగా తిలక్ వర్మను, కోచ్ సలాం బయాష్‌ను ముఖ్యమంత్రి సత్కరించారు. అనంతరం తిలక్ వర్మ తన క్రికెట్ బ్యాట్‌ను ముఖ్యమంత్రికి బహూకరించారు.









