Tuesday 20th May 2025
12:07:03 PM
Home > తాజా > 32 ఎకరాల్లో ఉస్మానియా హాస్పిటల్ కి కొత్త భవనం!

32 ఎకరాల్లో ఉస్మానియా హాస్పిటల్ కి కొత్త భవనం!

cm revath reddy
  • అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
  • గోషామహల్ పోలీస్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం
  • పోలీసు విభాగానికి ప్రత్నామ్నాయ స్థలం కేటాయింపు

హైదరాబాద్: నగరంలోని గోషామహల్‌ (Gosha Mahal)లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (Osmania General Hospital) కొత్త భవనాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. అందుకోసం గోషా మహల్‌ పోలీస్ స్టేడియం (Gosha Mahal Police Stadium), పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ (Police Sports Complex) కలిపి దాదాపు 32 ఎకరాల స్థలాన్ని వెంటనే వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న స్పీడ్‌ (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫీషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ) ప్రణాళికలో ఉన్న వివిధ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి గారు సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారు ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్పీడ్ జాబితాలో ఉన్న 19 పనుల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణం, 15 కొత్త నర్సింగ్ కాలేజీలు, 28 కొత్త పారా మెడికల్ కాలేజీలు, జిల్లాల్లో సమాఖ్య భవనాల నిర్మాణాలకు సంబంధించిన ప్రణాళికలను సీఎం గారు చర్చించారు.

రాబోయే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఆసుపత్రి నిర్మాణానికి అనుభజ్ఞులైన ఆర్కిటెక్టులతో డిజైన్లు రూపొందించాలని ఆదేశించారు.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అక్కడికి చేరుకునే కనెక్టింగ్ రోడ్లను అభివృద్ధి చేయాలని, ఆసుపత్రి చుట్టూ నలు దిశలా రోడ్డు ఉండేలా డిజైన్ చేయాలని చెప్పారు.

ఆసుపత్రికి అవసరమైన అన్ని విభాగాలతో పాటు అకడమిక్ బ్లాక్, నర్సింగ్ ఉద్యోగులకు హాస్టళ్లు కూడా నిర్మించేలా ప్రణాళికలు ఉండాలని చెప్పారు. కార్పొరేట్ తరహాలో వైద్య విభాగాలు, సేవలన్నీ అక్కడే అందుబాటులో ఉండాలని సూచించారు.

ఇప్పుడున్న ఉస్మానియా హాస్పిటల్ భవనాలను చారిత్రక కట్టడాలుగా పరిరక్షించే బాధ్యతను చేపడుతామని సీఎంగారు చెప్పారు. మూసీ రివర్ డెవెలప్‌మెంట్‌ ప్రాజెక్టులో భాగంగా అక్కడున్న భవనాలను పర్యాటకులను ఆకట్టుకునే చారిత్రక భవనాలుగా తీర్చిదిద్దుతామని అన్నారు.

గోషామహల్ స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించినందుకు పోలీసు విభాగానికి ప్రత్నామ్నాయ స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పేట్లబుర్జులో ఉన్న పోలీస్ ట్రాన్స్‌ పోర్ట్ ఆర్గనైజేషన్, సిటీ పోలీస్ అకాడమీ, చుట్టూ ఉన్న స్థలాన్ని క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.  

You may also like
cm revanth reddy
‘ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం గిరిజనులకు వరం’
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP
‘భారీగా పెరిగిన WTC ప్రైజ్ మనీ..ఎన్ని రూ.కోట్లంటే!’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions