Cm Revanth Apology To Supreme Court | ఢిల్లీ మద్యం కేసు ( Delhi Liquor Policy )లో బీఆరెస్ ఎమ్మెల్సీ ( Brs MLC )కవితకు దేశ సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన విషయం తెల్సిందే.
అయితే కవిత బెయిల్ పై సీఎం రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ) చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ( Supreme Court ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాజకీయ పార్టీలను సంప్రదించో, లేక రాజకీయ అంశాలను దృష్టిలో ఉంచుకుని తాము ఉత్తర్వులు ఇస్తామా? భాద్యతయుతమైన పదవిలో ఉండి, ముఖ్యమంత్రి చేయాల్సిన వ్యాఖ్యలు ఇవేనా అని సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. భారత న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం, గౌరవం ఉందని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను న్యాయవ్యవస్థను ప్రశ్నిస్తున్నట్లుగా కొందరు ఆపాదించారని తెలిపారు.
పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను విశ్వసించే తాను, ఎప్పటికీ న్యాయవ్యవస్థను అత్యున్నతమైనదిగానే భావిస్తానని చెప్పారు.