Cm Chandrababu Serious On MLA JC Asmit Reddy | వైఎస్సార్ కడప ( YSR Kadapa ) జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ( RTPP ) ఫ్లైయాష్ కాంట్రాక్ట్ ( Flyash Contract )విషయం పై ఎన్డీయే కూటమి నాయకుల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి.
మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ( JC Prabhakar Reddy ), జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ( Adinarayana Reddy ) మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తాయి. బహిరంగంగానే బూడిద కాంట్రాక్టు పై నాయకులు సవాళ్లు విసురుకోవడం సంచలనంగా మారింది.
ఈ నేపథ్యంలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ( Jc Asmit Reddy )పై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అనంతపురం పర్యటనకు వెళ్లిన సీఎంను అస్మిత్ రెడ్డి ఎయిర్పోర్ట్ లో కలిశారు.
ఈ సందర్భంగా అస్మిత్ రెడ్డిని సీఎం మందలించారు. బహిరంగంగా గొడవలకు దిగడం ఏంటి, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కదా? అని సీఎం ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీ కార్యకర్తల కోసమే ఇదంతా అని అస్మిత్ రెడ్డి చెప్పగా, కార్యకర్తలను తాను చూసుకుంటానని సీఎం చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.