Friday 23rd May 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > బిల్ గేట్స్ తో చంద్రబాబు భేటీ

బిల్ గేట్స్ తో చంద్రబాబు భేటీ

CM Chandrababu Meets Bill Gates At WEF | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మైక్రోసాఫ్ట్ ( Microsoft ) వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ( Bill Gates ) తో భేటీ అయ్యారు.

దావోస్ ( Davos ) లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం ( WEF )లో చంద్రబాబు పాల్గొని వివిధ కంపెనీలతో రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చలు జరుపుతున్నారు.

ఈ క్రమంలో బిల్ గేట్స్ తో బుధవారం భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఏఐ ( Artificial Intelligence )లో సహకారం అందించాలని బిల్ గేట్స్‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ఏఐ విశ్వవిద్యాలయం ( AI University ) కోసం నియమించిన సలహామండలిలో భాగస్వాములు కావాలని సీఎం ఆహ్వానించారు.

అలాగే బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ అమలుచేస్తున్న హెల్త్ డ్యాష్ బోర్డులు, సామాజిక కార్యక్రమాలను రాష్ట్రంలోనూ అమలు చేయాలని కోరారు.

ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను ముఖ్యమంత్రి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. 1995లో ఐటీ..ఇప్పుడు 2025లో ఏఐ అంటూ గత సమావేశాన్ని ప్రస్తుత సమావేశాన్ని పోలుస్తూ ముఖ్యమంత్రి పోస్ట్ చేశారు.

You may also like
అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP
‘భారీగా పెరిగిన WTC ప్రైజ్ మనీ..ఎన్ని రూ.కోట్లంటే!’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions