Monday 12th January 2026
12:07:03 PM
Home > తాజా > ఛార్జిషీటు దాఖలు..అల్లు అర్జున్ A-11

ఛార్జిషీటు దాఖలు..అల్లు అర్జున్ A-11

Chargesheet Filed Against Allu Arjun in Sandhya Theatre Stampede Case | సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తయ్యింది. ఈ క్రమంలో డిసెంబర్ 24న కోర్టులో పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ విషయాన్ని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ శనివారం వెల్లడించారు. మొత్తం 23 మంది నిందితులపై ఛార్జ్‌షీట్ దాఖలు చేయబడింది. వీరిలో 14 మంది నిందితులను అరెస్టు చేయగా, ముందస్తు బెయిల్ పొందిన 9 మంది నిందితులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దర్యాప్తులో సమయంలో థియేటర్ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకులు, ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది మరియు ఇతరుల మధ్య ప్రణాళిక, నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, సమన్వయంలో లోపాలు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇకపోతే థియేటర్ యజమానులను ప్రథమ నిందితులుగా పేర్కొన్నారు. నటుడు అల్లు అర్జున్ పేరును A-11గా చేర్చారు. 2024 డిసెంబర్ 4 రాత్రి 9.30 గంటల సమయంలో ఆర్టీసీ ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న సంధ్య థియేటర్ లో పుష్ప-2 బెనిఫిట్ షో ప్రదర్శన జరిగింది. ఈ సమయంలో అల్లు రాకతో అభిమానులు పోటెత్తగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డారు.

You may also like
అల్లు అర్జున్ పాట పాడి అదరగొట్టిన కేంద్రమంత్రి
చెప్పులు లేకుండా రోడ్డుపై రౌడీలు..గుంటూరు పోలీసుల తీరే వేరు!
‘హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారు’..ఒవైసీ vs బండి
సైబర్ వలలో జేడీ లక్ష్మీనారాయణ సతీమణి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions