Can Sun Risers Cross 300-Run Score | ఐపీఎల్-2025 ప్రారంభమయ్యింది. శనివారం ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన తొలిపోరులో కోల్కత్త పై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఘన విజయం నమోదు చేసింది.
ఇకపోతే ఆదివారం మధ్యాహ్నం ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ తపడనున్నాయి. గత సీజన్ లో భారీ స్కోర్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడిన హైదరాబాద్, ఈ సారి మరింత పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ తో బరిలోకి దిగనుంది.
ఓపెనర్లు హెడ్-అభిషేక్, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డికి తోడుగా ఈసాయి పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ తొడయ్యాడు. గత సీజన్ లో ఏకంగా మూడు సార్లు 250 పైచిలుకు స్కోర్లు సాధించి ప్రత్యర్థి జట్లను వణికించింది. ఐపీఎల్ చరిత్రలోనే హైఎస్ స్కోర్ 287 కూడా హైదరాబాద్ ఖాతాలోనే ఉంది.
అలాగే పవన్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన టీం కూడా హైదరాబాదే కావడం విశేషం. ఈ క్రమంలో ఈసారి హైదరాబాద్ 300 స్కోర్ ను దాటడం ఖాయంగా కనిపిస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలోని ఫ్లాట్ పిచ్ పై పరుగుల వరద పారే అవకాశం ఉంది. దింతో దుర్బేద్యమైన బ్యాటింగ్ తో బరిలోకి దిగుతున్న హైదరాబాద్ 300 పరుగులు చేస్తుందా అనేది ఆసక్తి గా మారింది.