BSNL Launches IPL 251 Prepaid Recharge Plan With 251GB Data | ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ మాస్టర్ స్ట్రోక్ ప్లాన్ తో ముందుకొచ్చింది.
ఓ వైపు ప్రైవేట్ టెలికాం సంస్థలు అయిన జియో, ఎయిర్టెల్ వంటివి వినియోగదారులపై అధిక ఛార్జీలు వసూలు చేస్తుంటే బీఎస్ఎన్ఎల్ మాత్రం తక్కువ ధరకే ఎక్కువ డేటాను అందించనుంది. ఎక్కువగా డేటాను వినియోగించే కస్టమర్లకు అలాగే ఐపీఎల్ సమయంలో ఎలాంటి డేటా ఇక్కట్లు పడకుండా ఉండేందుకు కేవలం రూ.1కే ఒక జీబీ డేటాను అందించేందుకు బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ ను తీసుకువచ్చింది.
ఈ ప్లాన్ ప్రకారం కేవలం రూ.251 రూపాయలతో రీఛార్జి చేస్తే 60 రోజుల వ్యాలీడిటితో 251 డేటా లభించనుంది. పైగా రోజూ ఎలాంటి వినియోగ పరిమితి లేదు. కానీ, ప్లాన్ ను వినియోగించుకోవాలంటే కస్టమర్లు చెల్లుబాటు అయ్యే యాక్టీవ్ రీఛార్జి ప్లాన్ కలిగి ఉండాలి.
BSNL ఇప్పటికే 4జీ, 5జీ సేవాల్ని దేశవ్యాప్తంగా విస్తరించడానికి ప్రణాళికలు చేస్తోంది. ఈ నేపథ్యంలో 9 కోట్ల మంది కస్టమర్లు కలిగిన బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను ఆకట్టుకోవడానికి నూతన ప్లాన్ లతో వస్తుంది. అలాగే ఈ ఏడాది జూన్ నాటికి 4జీ సేవల్ని అందుబాటులోకి తీసుకురానుంది. అనంతరం 5జీ సేవల్ని విస్తరించనుంది.