Tuesday 17th March 2026
12:07:03 PM
Home > తాజా > ఏడో గ్యారెంటీని అమలు చేస్తున్నారు..సీఎం పై కేటీఆర్ ఆగ్రహం!

ఏడో గ్యారెంటీని అమలు చేస్తున్నారు..సీఎం పై కేటీఆర్ ఆగ్రహం!

ktr

KTR Fires On CM Revanth | కొద్ది రోజుల కిందట పోలీసుల విధులను అడ్డగించారని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డితో పాటు పార్టీ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ (Errolla Srinivas), మరికొంత మందిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ పై బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. అక్రమంగా అరెస్టుచేయడం దుర్మార్గమైన చర్య అనిమండిపడ్డారు.

ఎన్నికల ప్రచారంలో దళిత, బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం బీఆర్ఎస్ తరఫున ప్రశ్నిస్తున్నందుకే ఎర్రోళ్లపై కక్షగట్టి అక్రమ కేసులతో వేధించాలని చూస్తున్నారని విమర్శించారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తెల్లవారుజామున ఎర్రోళ్ల ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురిచేయడాన్ని ఖండించారు.

ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారెంటీలను అటకెక్కించి, ఏడో గ్యారెంటీగా ఎమర్జెన్సీని ముఖ్యమంత్రి అమలుచేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను తట్టుకోలేక.. నిర్బంధం, అణచివేతతో బీఆర్ఎస్ గొంతునొక్కే విఫల యత్నం చేస్తున్నారని ఆరోపించారు.

రోజురోజుకూ పెరిగిపోతున్న నేరాల నియంత్రణలో పూర్తిగా చేతిలెత్తేసి, ప్రధాన ప్రతిపక్షాన్ని ఎలా నియంత్రించాలనే దానిపైనే సర్వశక్తులు ఒడ్డుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశు. అక్రమంగా అరెస్టుచేసిన ఎర్రోళ్ళ శ్రీనివాస్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
Minister Adluri Laxman
‘గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions