New Social Media Code For Govt Servants | బిహార్ ప్రభుత్వం (Bihar Government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం రూపొందించిన కొత్త సోషల్ మీడియా మార్గదర్శకాలను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది.
ప్రభుత్వ ఉద్యోగులకు సోషల్ మీడియా ప్లాట్ ఫాంల వినియోగంపై కొన్ని ఆంక్షలు విధించింది. ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, యూట్యూబ్ వంటి వేదికల్లో ఉద్యోగుల ప్రవర్తనపై కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ఉద్దేశం సోషల్ మీడియాను నిషేధించడం కాదు.
కానీ డిజిటల్ స్పేస్‌లో క్రమశిక్షణ, బాధ్యత, గౌరవాన్ని నిలబెట్టడమే లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. ఈ మార్గదర్శకాల ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియా ఖాతా తెరవాలంటే ముందుగా సంబంధింత శాఖాధికారుల అనుమతి తీసుకోవాలి.
ఫేక్ లేదా ఇతరుల పేరుతో ఖాతాలకు అనుమతి లేదు. వ్యక్తిగత పోస్టుల్లో హోదా, ప్రభుత్వ లోగో లేదా చిహ్నాలు ఉపయోగించకూడదు. అధికారిక ఈమెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేసుకోవద్దు.
అశ్లీల, దూషణాత్మక, సామాజిక సామరస్యాన్ని భంగం చేసే కంటెంట్‌ను పోస్ట్ చేయడం నిషేధం. కులం, మతం, వ్యక్తులను లక్ష్యంగా చేసుకునే పోస్టులు చేయకూడదు.
అధికారిక సమావేశాలు, సున్నితమైన సమాచారాన్ని షేర్ చేయకూడదు. ప్రభుత్వ విధానాలపై బహిరంగ విమర్శలు చేయకుండా రాజకీయ తటస్థత పాటించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.









