Saturday 31st January 2026
12:07:03 PM
Home > తాజా > బిగ్ బాస్ హౌస్ కు అధికారుల తాళాలు..రంగంలోకి డిప్యూటీ సీఎం

బిగ్ బాస్ హౌస్ కు అధికారుల తాళాలు..రంగంలోకి డిప్యూటీ సీఎం

Bigg Boss Kannada studio unsealed after D.K. Shivakumar steps in | నటుడు కిచ్చా సుదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో-కన్నడ వివాదంలో చిక్కుకుంది. షో కొనసాగుతూ హౌస్ లో కంటెస్టెంట్లు ఉన్న సమయంలోనే కర్ణాటక రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు బిగ్ బాస్ హౌస్ కు తాళాలు వేశారు.

రామనగర జిల్లా బిడది ఇండస్ట్రియల్ ఏరియాలోని జాలీవుడ్ స్టూడియోస్ లో ప్రస్తుతం బిగ్ బాస్ షూట్ జరుగుతోంది. అయితే స్టూడియో నుంచి నిత్యం 2.5 లక్షల లీటర్ల కలుషిత నీరు బయటకు వస్తుందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అధికారులు రెండు సార్లు బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ పట్టించుకోలేదు. దింతో గత మంగళవారం అధికారులు బిగ్ బాస్ హోస్ కు తాళాలు వేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించి, తాళాలను తిరిగి తెరిపించారు. బెంగళూరు సౌత్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ కలెక్టర్‌ను బిగ్ బాస్ హౌస్ కు వేసిన సీల్‌ను తొలగించాలని ఆదేశించారు. పర్యావరణ నిబంధనల పాటింపుకు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నప్పటికీ, కర్ణాటక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఉల్లంఘనలను సరిచేయడానికి స్టూడియోకు సమయం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు ఈ సందర్భంగా డీకే శివకుమార్ స్పష్టం చేశారు.

You may also like
ఎన్నికల బరిలో గల్వాన్ వీరుడు సంతోష్ బాబు తల్లి
కేసీఆర్ ఇంటి గోడకు సిట్ నోటీసులు..కేటీఆర్ కన్నెర్ర
బంగారం, వెండి ధరలు పతనానికి కారణం ఈయనే!
రష్యన్ అమ్మాయిలతో సెక్స్..బిల్ గేట్స్ కు రోగం?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions