Bhumana Karunakar Reddy Counter to cm Chandrababu Comments | ముఖ్యమంత్రి చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి. కాగా మంగళవారం శాసనసభలో తిరుమల లడ్డూ కల్తీ అంశంపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భూమన కరుణాకర్ రెడ్డి తన కుమార్తె వివాహాన్ని మెదక్ చర్చిలో జరిపించారని, క్రిస్టియన్ సంప్రదాయంలో కుమార్తె వివాహం జరిపించిన భూమనను టీటీడీ ఛైర్మన్ గా నియమిస్తే న్యాయం జరుగుతుందా అని సీఎం ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సీఎం ఆరోపణలపై భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ..తన కుమార్తె పెళ్లి తిరుచానూరు లో 30 వేలమంది సమక్షంలో చేసినట్లు స్పష్టం చేశారు. వివాహానికి చంద్రబాబు తమ్ముడు అలాగే ప్రస్తుత మంత్రి లోకేష్ మామ, ముఖ్యమంత్రి వియ్యంకుడు బాలకృష్ణ కూడా వచ్చారని పేర్కొన్నారు. హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు, వేదాపారాయణ దారులు వచ్చి ఆశీర్వదించారని వివరించారు. చంద్రబాబు అనేకమార్లు చేతిలో బైబిల్ పట్టుకొన్నారు.. మరి ఆయన హిందువా అని ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ మూడవ భార్య క్రిస్టియన్ అని ఆయన్ను క్రిస్టియన్ అని ఎందుకు అనరని ఘాటుగా ప్రశ్నించారు.










