Rajastan New CM | భారతీయ జనతా పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాజస్థాన్ లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే.
ఇప్పటికే ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అగ్ర నేతలను కాదని, కొత్త వారిని ముఖ్యమంత్రులుగా ఎంపిక చేసింది బీజేపీ.
అదేకోవలో రాజస్థాన్ లో రెండు పర్యాయాలు సీఎంగా పనిచేసిన వసుంధర రాజే ను కాదని, ఎమ్మెల్యే గా తొలిసారి గెలిచిన భజన్ లాల్ శర్మ ను ముఖ్యమంత్రిగా ప్రకటించింది బీజేపీ అధిష్టానం.
56 ఏళ్ల భజన లాల్ బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తి, అంతే కాకుండా రాజస్థాన్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా నాలుగు పర్యాయాలు పనిచేశారు. ఆరెస్సెస్ కు అత్యంత సన్నిహితుడు. పీజీ పూర్తి చేసిన భజన లాల్ పై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు.
ఈ నేపథ్యంలో భజన లాల్ శర్మ ను బీజేపీ అధిష్టానం ఎంపిక చేయగా, ఆయన్ను శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. ఇదిలా ఉండగా దియా సింగ్ కుమారీ, ప్రేమ్ చంద్ బైర్వా లను ఉప ముఖ్యమంత్రులుగా ప్రకటించింది బీజేపీ.
రాజస్థాన్ సీఎంగా ఎంపికైన భజన్ లాన్ ను అభినందిస్తున్న కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్