Betting App Case: Vijay Devarakonda’s Team Issues Clarification | బెట్టింగ్ యాపులను ప్రమోట్ ( Promote ) చేశారని టాలీవుడ్ కు చెందిన పలువురు నటులపై మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విషయం తెల్సిందే.
ఇందులో రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ వంటి అగ్ర నటులు ఉన్నారు. కేసు నమోదైన నేపథ్యంలో విజయ్ దేవరకొండ టీం స్పందించింది. విజయ్ కేవలం స్కిల్ బేస్డ్ గేమ్స్ ( Skill Based Games ) ను మాత్రమే ప్రమోట్ చేసినట్లు టీం వివరణ ఇచ్చింది. ఆన్లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ ప్రమోషన్లు చేశారని పేర్కొంది.
సదరు కంపెనీలు కూడా నిబంధనలకు లోబడే వ్యవహరిస్తున్నాయని టీం తెలిపింది. ఏ23 అనే సంస్థకు విజయ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన విషయం తెల్సిందే. అయితే రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో సుప్రీం కోర్టు పేర్కొందని విజయ్ టీం ప్రకటనలో వెల్లడించింది.
ఏ23 కంపెనీతో విజయ్ ఒప్పందం గతేడాదే ముగిసినట్లు, ప్రస్తుతం ఆ సంస్థతో నటుడికి సంబంధం లేదని టీం స్పష్టం చేసింది. గురువారం వచ్చిన కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని టీం కొట్టిపారేసింది.