BCCI Seeks Dhoni Help | టీం ఇండియా ప్రధాన కోచ్ కోసం (Team India Head Coach) బీసీసీఐ (BCCI) పలు పేర్లను పరిశీలిస్తోంది. ఇప్పటికే హెడ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను స్వీకరిస్తోంది. మే 27 ఆఖరి తేదీ.
ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) పదవి కొనసాగింపు పై ఆసక్తిగా లేడని తెలుస్తోంది. దింతో న్యూజిలాండ్ (New Zealand) మాజీ కెప్టెన్, ఐపీఎల్ లో చెన్నై టీం కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ (Stephen Fleming) తో బీసీసీఐ చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతుంది.
ఇందుకోసం భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (MS Dhoni) సాయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఇండియన్ ప్లేయర్స్ ను అర్ధం చేసుకోవడం లో ఆయన సరిగ్గా సరిపోతారని బీసీసీఐ భావిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.
ఇకపోతే ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ (Ricky Ponting), కోల్కత్త టీం మెంటర్ గౌతమ్ గంభీర్ (Gautham Gambhir) పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి.
వీరితో పాటు ముంబై ఇండియన్స్ కోచ్, శ్రీలంక మాజీ క్రికెటర్ మహేలా జయవర్ధనే (Jaya Vadhane), ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగెర్ పేర్లను కూడా బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరి ఆఖరికి టీం ఇండియా హెడ్ కోచ్ గా ఎవరు నియమితులు అవుతారు అనేది ఆసక్తిగా మారింది.