Friday 25th April 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > కాంగ్రెస్ గెలుస్తుందని రూ.50 లక్షల పందెం వేసా…ఏపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..!

కాంగ్రెస్ గెలుస్తుందని రూ.50 లక్షల పందెం వేసా…ఏపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..!

Balineni Srinivas Reddy News| సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ( YCP ) నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ( Balineni Srinivas Reddy ).

ఈ మేరకు శనివారం ఒంగోలు ( Ongole ) లో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..ముప్పై ఏండ్ల నుండెజ్ రాజకీయాల్లో ఉన్నానని కానీ, ఇప్పటి రాజకీయాలు చూస్తుంటే ఇర్రిటేషన్ ( Irritation ) వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా ఒంగోలు నుండే పోటీ చేస్తానని స్పష్టం చేసారాయన. కాగా తెలంగాణ ( Telangana ) అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ( Congress Party )గెలుస్తుందని, వేరే వ్యక్తితో రూ.50 లక్షలు పందెం కాసినట్లు వ్యాఖ్యానించారు.

కానీ తన కొడుకు తెలంగాణ జిల్లాలు తిరిగి, మళ్ళీ బీఆరెస్ ( Brs ) గెలవాలని, అలా అయితేనే ఏపీలో వైసీపీ గెలుస్తుందని తపన పడడంతో, అతని బాధ చూడలేక పందెం విరమించుకున్నట్లు పేర్కొన్నారు.

అలాగే తాను ఏమి నీతిమంతుండ్ని కాదని మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ వైసీపీ నేత.

You may also like
‘లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు’
‘పిఠాపురంలో దళితులపై గ్రామ బహిష్కరణ’
‘మీ ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది’
smitha sabharwal
‘వాళ్లందరికీ నోటీసులు పంపారా..’ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ట్వీట్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions