Bail Granted To Jani Master | టాలీవుడ్ కొరియోగ్రాఫర్ ( Tollywood Choreographer ) జానీ మాస్టర్ ( Jani Master ) కు ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయ్యింది. లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న జానీ మాస్టర్ కు షరతులతో కూడిన బెయిల్ ను న్యాయస్థానం మంజూరు చేసింది.
జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగికంగా వేదించారని జూనియర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. మహిళా కొరియోగ్రాఫర్ పిర్యాదు నేపథ్యంలో పోలీసులు జానీ మాస్టర్ పై పొక్సో చట్టం కింద కేసును నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో గత రెండు వారాలుగా జానీ మాస్టర్ చంచల్ గూడా జైలులోనే ఉన్నాడు. పొక్సో చట్టం కింద కేసు నమోదవ్వడంతో జానీ మాస్టర్ కు ప్రకటించిన నేషనల్ అవార్డును నిలిపివేస్తున్నట్లు కమిటీ ప్రకటించింది.
ఇదిలా ఉండగా తనకు బెయిల్ మంజూరు చేయాలని జానీ మాస్టర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దింతో షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది.