Tuesday 22nd April 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అయోధ్య బాలరాముడికి భారీ విరాళం.. తొలి రోజు ఎన్ని వచ్చాయంటే!

అయోధ్య బాలరాముడికి భారీ విరాళం.. తొలి రోజు ఎన్ని వచ్చాయంటే!

ram mandir

Ayodhya Ram Mandir | అయోధ్యలో రామమందిరంలో బాల రాముడి ప్రతిష్టాపన తర్వాత భక్తులు పెద్ద ఎత్తున సందర్శిస్తున్నారు. ప్రాణ ప్రతిష్ట జరిగిన మరుసటి రోజు నుంచే లక్షల సంఖ్యలో రామ భక్తులు దర్శనానికి విచ్చేస్తున్నారు. దీంతో అయోధ్య మొత్తం భక్తజన సంద్రంలా మారిపోతోంది.

తొలిరోజే సుమారు 5 లక్షల మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారని ఆలయ ట్రస్ట్ వెల్లడించింది. ఇక రెండో రోజు కూడా భక్తులతో క్యూ లైన్లు భారీగా బారులు తీరాయని పేర్కొంది.

బుధవారం రాత్రి 10 గంటల వరకు 2.5 లక్షల మందికి అయోధ్య బాలక్ రామ్ దర్శనం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో బాల రాముడికి విరాళాలు కూడా భారీగానే సమకూరుతున్నాయి.

తొలి రోజైన మంగళవారం నాడు భారీగా విరాళాలు వచ్చినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తాజాగా వెల్లడించింది. అయోధ్య బాలక్ రామ్ మందిరంలో ఏర్పాటు చేసిన కౌంటర్లు, ఆన్‌లైన్ ద్వారా తొలి రోజే రూ.3.17 కోట్ల విరాళాలు వచ్చినట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు.

You may also like
1200 కి.మీ.పరుగుతీసి..అయోధ్య రాముడిని దర్శించుకున్న ఆరేళ్ళ బాలుడు
బాల రాముడి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఎంతమంది వచ్చారంటే
ram mandir
రామ భక్తులకు శుభవార్త.. ఆలయ ట్రస్ట్ కీలక ప్రకటన!
rahul gandhi
అయోధ్యకు రాష్ట్రపతి ఎందుకు రాలేదు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions