Wednesday 14th May 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > తిరుమలేశుని సన్నిధిలో చంద్రబాబు కుటుంబం!

తిరుమలేశుని సన్నిధిలో చంద్రబాబు కుటుంబం!

Babu at Tirumala

Chandra Babu Visits Tirumala | ఏపీ కేబినెట్ (AP Cabinet) ప్రమాణ స్వీకారం బుధవారం జరిగిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు (CM Chandra Babu) సహా 25 మంది ప్రమాణం చేశారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల (Tirumala) వేంకటేశుని దర్శనానికి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శనం సందర్భంగా ఆలయ రంగనాయక మంటపంలో వేదపండితులు చంద్రబాబుకు ఆశీర్వచనాలు అందించారు. టీటీడీ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Read Also: పవన్ ప్రమాణ స్వీకారం.. మెగా ఫ్యామిలీ ఎమోషనల్!

తిరుమల నుంచి బయలుదేరి నుంచి విజయవాడలో కనకదుర్గ అమ్మ వారిని దర్శించుకునేందుకు వెళ్లారు. అనంతరం ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్లి,  సాయంత్రం 4గంటల 41 నిమిషాలకు సచివాలయం ఛాంబర్ లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపడతారు. ఈ సందర్బంగా మొదటగా ఐదు ఫైళ్లపై సంతకాలు చేయనున్నారు.

You may also like
“Operation Keller”..సైన్యం సంచలన ప్రకటన
‘భారత బలం-సంయమనం రెండింటినీ చూశాం’
ఆదంపూర్ ఎయిర్ బేస్ లో ప్రధాని
మృణాల్ ఠాకూర్ తో పెళ్లి..స్పందించిన నటుడు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions