Sunday 27th April 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > “సొంత సామాజిక వర్గం కన్నా కాపులే నాకు అండగా ఉన్నారు”..వైసీపీ ఎంపీ సంచలనం..!

“సొంత సామాజిక వర్గం కన్నా కాపులే నాకు అండగా ఉన్నారు”..వైసీపీ ఎంపీ సంచలనం..!

Mopidevi Venkataramana| వైసీపీ ( YCP ) నేత, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ( Mopidevi venkataramana ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు రేపల్లె ( Repalle ) లో నిర్వహించిన కాపులు నిర్వహించిన కార్తీక సమారాధనలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను రాజకీయంగా ఈ స్థాయిలో ఉన్నానంటే కాపులే కారణం అని స్పష్టం చేశారు.

తన సొంత సామాజిక వర్గం నూటికి 90 శాతం మద్దతు ఇవ్వకపోయినా, తాను పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో కాపులు అధికంగా ఉండే ప్రాంతాల్లో నూటికి 90 శాతం మెజారిటీ ( Majority ) ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.

అందుకె ఇక నుండి తాను మోపిదేవి వెంకటరమణ రావు గా కాకుండా వెంకటరమణ నాయుడి ( Nayudu )గా ఉంటానని పేర్కొన్నారు.

వంగవీటి మోహన రంగా ( Vangaveeti Mohan Ranga ) ఎంతో మందికి ఆదర్శమని, అందుకే త్వరలోనే రెపల్లలో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తానని తెలిపారు ఈ నేత.

You may also like
‘కరుంగాలి కంబు’తో పవన్ కళ్యాణ్ ను సత్కరించిన తమిళనాడు నేత
‘లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు’
‘పిఠాపురంలో దళితులపై గ్రామ బహిష్కరణ’
‘మీ ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions