Allu Arjun Get’s Interim Bail From The High Court | టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ లభించింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో శుక్రవారం అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వం, అల్లు అర్జున్ తరఫున వాదనలు విన్న న్యాయస్థానం అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది.
మరోవైపు చిక్కడపల్లి పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై శుక్రవారం సాయంత్రం న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో బెయిల్ ఆర్డర్ అందిన వెంటనే అర్జున్ విడులయ్యే అవకాశం ఉంది.