Allu Arjun Daughter Allu Arha Fun With Manchu Lakshmi | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ మంచు లక్ష్మీని సరదాగా అడిగిన ఓ ప్రశ్న ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
‘మీరు తెలుగు వారేనా’ అని మంచు లక్ష్మీని అర్హ అడిగింది. దింతో లక్ష్మీ ఆశ్చర్యపోయారు. అలా అడగాలని ఎందుకు అనిపించిందని అన్నారు. దింతో మీ యాస చూసి అడగాలని అనిపించినట్లు అర్హ పేర్కొనడంతో అందరూ నవ్వుకున్నారు.
తాజగా మంచు లక్ష్మీ, అల్లు అర్హ సంభాషణను సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఇందులో వీరిద్దరి మధ్య నెలకొన్న ఫన్నీ మూమెంట్స్ నెటీజన్లను ఆకట్టుకున్నాయి. ‘నేను తెలుగే, అయినా నీకు అలా ఎందుకు అడగాలని అనిపించింది’ అని లక్ష్మీ అర్హను అడిగారు.
ఇదే సమయంలో పక్కనే ఉన్న అల్లు అర్జున్ కూడా ఎందుకు ఆ ప్రశ్న వేశావు అని కుమార్తెను అడిగారు. దీనిపై స్పందించిన అర్హ మంచు లక్ష్మీ యాసను చుస్తే అనుమానం వచ్చిందని చెప్పడంతో లక్ష్మీ, అల్లు అర్జున్ మరియు ఆయన సతీమణి స్నేహ నవ్వుకున్నారు









