Aara survey exit polls | తెలంగాణ ఎన్నికలు ముగియడంతో సాయంత్రం 5.30 నిమిషాల నుండి ఎగ్జిట్ పోల్స్ విడుదల అవుతున్నాయి. ఇప్పటికే CNN న్యూస్ 18 ప్రకటించిన సర్వేలో తెలంగాణలో హంగ్ రానున్నట్లు తెలిపింది. అయితే ప్రముఖ ఆరా సంస్థ మాత్రం సంచలన సర్వేను విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టడం ఖాయం అని పేర్కొంది. అధికార బీఆరెస్ 39.58% ఓటింగ్ తో, 41-49 సీట్లు రావొచ్చని కానీ ప్రతిపక్ష కాంగ్రెస్ కు మాత్రం 41.13% ఓటింగ్ తో 58-67 సీట్లలో విజయం సాదించనుంది. బీజేపీ కి 5-7, ఎంఐఎం 7 చోట్ల ఇతరులు 2 స్థానాల్లో గెలుస్తారని సర్వేను వెల్లడించింది ఆరా.