India Today Exit Polls | తెలంగాణ ఎన్నికలకు సంబంధించి జాతీయ మీడియా ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది. తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ దే అధికారం అని తేల్చి చెప్పింది ఇండియా టుడే.
119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 63 నుంచి 73 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపింది.
ఇక అధికార బీఆరెస్ పార్టీ 34 నుంచి 44 స్థానాలకు పరిమితం అవుందని ఇండియా టుడే పేర్కొంది. బీజేపీ 4 నుంచి 8 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
ఇక ఎంఐఎం, ఇతర పార్టీలు లేదా స్వతంత్య్ర అభ్యర్థులు 5 నుంచి 8 స్థానాలు గెలుచుకుంటాయని ఈ జాతీయ మీడియా తెలిపింది.
కాంగ్రెస్ 42 శాతం, బీఆర్ఎస్ 36, బీజేపీ 14, ఎంఐఎం 3, ఇతరులు 5 శాతం ఓట్లు గెలుచుకుంటారని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా తన ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించింది.