AAP Defeats BJP In Gujarat Bypoll | దేశవ్యాప్తంగా ఐదు శాసనసభ స్థానాలకు జూన్ 19న ఎన్నికలు జరిగాయి. వీటి ఫలితాలు సోమవారం వెలువడ్డాయి.
గుజరాత్ లోని విశావదర్, కాడి అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా విశావదర్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసింది. బీజేపీ అభ్యర్థి కిరీట్ పటేల్ పై ఆప్ నేత గోపాల్ ఇటాలియా 17 వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు.
ఈ నేపథ్యంలో ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. గుజరాత్ ప్రజలు ఆప్ వైపు చూస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లోనూ ఈ సీటు నుండి ఆప్ నేత భుపేంద్ర భయాని గెలిచారు. అయితే ఆయన రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.
గుజరాత్ లో బీజేపీ దశాబ్దాలుగా గెలుస్తున్నప్పటికీ విశావదర్ లో మాత్రం 2007 నుండి ఆ పార్టీ విజయం సాధించలేదు. ఇకపోతే కాడి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ చావ్దా పై బీజేపీ అభ్యర్థి రాజేంద్ర చావ్డా గెలిచారు.
మరోవైపు పంజాబ్ లోని లూథియానా వెస్ట్ సీటులో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఆప్ ఘన విజయం సాధించింది.