BCCI drops 1040 players from IPL auction | ఐపీఎల్-2026 లీగ్ కు సంబంధించి డిసెంబర్ 16న అబుదాబి వేదికగా ఆక్షన్ జరగనుంది. ఈ క్రమంలో 350 మంది ప్లేయర్లతో కూడిన తుది జాబితాను బీసీసీఐ తాజగా వెల్లడించింది. అయితే అనూహ్యంగా 1000మందికి పైగా ప్లేయర్ల పేర్లను తొలగించింది. తొలుత ఐపీఎల్ ఆక్షన్ కోసం 1390 మంది ప్లేయర్లు తమ పేరును నమోదు చేసుకున్నారు.
అయితే బీసీసీఐ ఇందులో నుంచి కొద్దిమంది ప్లేయర్లతో కూడిన జాబితాను షార్ట్ లిస్ట్ చేసింది. 240 భారత ఆటగాళ్లు, 110 మంది విదేశి ఆటగాళ్లు ఇందులో ఉన్నారు. అన్ని ఫ్రాంఛైజీలు కలిపి 77 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. 173 మంది ఆటగాళ్లను జట్లు రిటైన్ చేసుకున్నాయి. ఇకపోతే కోల్కత్త నైట్ రైడర్స్ వద్ద అత్యధికంగా రూ.64.30 కోట్లు, ఆ తర్వాత చెన్నై వద్ద రూ.43.40 కోట్ల పర్స్ ఉంది.
మరోవైపు సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ ను తుది జాబితాలో చేర్చాలని ఓ ఫ్రాంఛైజీ బీసీసీఐ ని కోరినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన పేరును షార్ట్ లిస్టులో బీసీసీఐ చేర్చిందని తెలుస్తోంది.









