Samantha Wedding | స్టార్ హీరోయిన్ సమంత (Samantha) మరోసారి వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో సమంత అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidumoru) తో పెళ్లి చేసుకున్నారు.
వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు సమంతకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సమంత గత కొంతకాలంగా దర్శకుడు రాజ్ నిడిమోరు తో డేటింగ్ చేస్తున్నట్లు చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.
వీటికి బలం చేకూరుస్తూ సమంత కూడా రాజ్ తో పలుమార్లు క్లోజ్ గా ఉన్న ఫోటోల్లో దర్శనమిచ్చారు. రాజ్ డీకే కలిసి తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ హనీ బన్నీ సినిమాల్లో సమంత నటించారు. ఆ సమయంలోనే రాజ్ సమంత మధ్య పరిచయం పెరిగి, పెళ్లి వరకు దారితీసిందని సినీ సర్కిళ్లలో చర్చించుకుంటున్నారు.









