Gautam Gambhir Asks BCCI To Take Call On His Future | టీం ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సౌత్ ఆఫ్రికాతో సొంతగడ్డపై జరిగిన సిరీస్ లో టీం ఇండియా ఆడిన రెండు టెస్టులోనూ ఓడింది. గౌహతీ వేదికగా జరిగిన టెస్టులో ఏకంగా 408 పరుగులతో ఓడి చరిత్రలోనే అతి పెద్ద ఓటమిని చవిచూసింది. ఈ క్రమంలో కోచ్ గౌతమ్ గంభీర్ పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఓటమి తర్వాత గంభీర్ మీడియాతో మాట్లాడారు.
తన భవిష్యత్ పై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదని జట్టే ముఖ్యమని స్పష్టం చేశారు. అందరూ స్వదేశంలో న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికాతో సిరీస్ వైట్ వాష్ గురించి మాట్లాడుతున్నారని కానీ యువ జట్టుతో ఇంగ్లాండ్ లో సిరీస్ సమం అయినప్పుడు, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ విక్టరీ సమయంలోనూ తానే కోచ్ అని పేర్కొన్నారు. ఓటమికి బాధ్యత మొదట తనతో మొదలై అందరిపై ఉంటుందన్నారు. కానీ ఓ వ్యక్తిని లేదా ఒక సందర్భాన్ని నిందించడం సరికాదన్నారు. ఇప్పుడు గంభీర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.









