DCA Issues Immediate Ban on Two Cough Syrups | చిన్నారుల ప్రాణాలకు ప్రమాదం అయిన మరో రెండు దగ్గు నివారణ సిరప్ లను తెలంగాణ ప్రభుత్వం నిషేదించింది. రిలీఫ్ కాఫ్ సిరప్ బ్యాచ్ నంబర్-LSL25160 మరియు రెస్పీఫ్రెష్ టీఆర్ దగ్గు నివారణ సిరప్ బ్యాచ్ నంబర్-R01GL2523 పై నిషేధం విధిస్తూ తెలంగాణ ప్రభుత్వ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. తల్లిదండ్రులు తమ చిన్నారులకు వీటి వాడకాన్ని వెంటనే ఆపేయాలని సూచించింది.
అలాగే హాస్పిటల్స్, మెడికల్ షాపులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో కూడా అత్యంత ప్రమాదకరమైన డైఇథైలిన్ గ్లైకాల్ అధికమొత్తంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ తీసుకున్న 14 మంది చిన్నారులు మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో మరణించడం కలకలం రేపింది. ఇందులో ఏకంగా 48.6 శాతం అత్యంత ప్రమాదకరమైన డైఇథైలిన్ గ్లైకాల్ ఉందని తేలింది. ఈ నేపథ్యంలో అప్రమత్తం అయిన తెలంగాణ అధికారులు దీనిపై నిషేధం విధించారు.









