Ponnam Prabhakar apologises to Adluri Laxman | తెలంగాణ మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ మధ్య చెలరేగిన విభేదాలు సద్దుమణిగింది. ఈ మేరకు ఈ ఇద్దరి నేతలతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం ఉదయం భేటీ అయ్యారు. అనంతరం అడ్లూరి లక్ష్మణ్ కు పొన్నం క్షమాపణలు చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ లో పుట్టి పెరిగిన వ్యక్తిగా తనకు మరియు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు పార్టీ సంక్షేమం తప్ప ఎటువంటి దురుద్దేశం లేదన్నారు. తాను ఆ మాట అనకపోయినా పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం అడ్లూరి బాధ పడిన దానికి తాను క్షమాపణలు కోరుతున్నట్లు స్పష్టం చేశారు మంత్రి పొన్నం. అయితే ప్రచారం జరుగుతున్నట్లు తాను అడ్లూరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని తనకు అలాంటి ఆలోచన లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఆ సంస్కృతి నేర్పలేదని పేర్కొన్నారు.
సామాజిక న్యాయం కోసం పోరాడే సందర్భంలో వ్యక్తిగత అంశాలు పక్కన ఉంచి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయంలో బలహీనవర్గాల బిడ్డగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో రాహుల్ గాంధీ సూచన మేరకు 42 శాతం రిజర్వేషన్లకు పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కి వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పారు.









