Saturday 31st January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > బీహార్ ఎన్నికల నగారా.. తొలిసారి కలర్ ఫోటో

బీహార్ ఎన్నికల నగారా.. తొలిసారి కలర్ ఫోటో

Bihar Assembly Election 2025 | బీహార్ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ షెడ్యూల్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈవీఎంలలో తొలిసారి అభ్యర్థుల కలర్ ఫోటోను ప్రదర్శించబోతున్నట్లు ఈసీ ప్రకటించింది. 243 శాసనసభ స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీలో మొదటి విడతలో 121 స్థానాలకు, రెండవ విడతలో 122 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 6, నవంబర్ 11 న ఎన్నికలు జరగనున్నాయి.

ఇందులో భాగంగా 90 వేల పోలింగ్ స్టేషన్లలో 7.43 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. కాగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో జేడీయూ, బీజేపీ ఎన్డీయే కూటమిగా ఆర్జేడీ, కాంగ్రెస్ మరియు వామపక్షాలు కలసి ఇండీ కూటమిగా ఎన్నికల రణరంగంలో తలపడుతున్న విషయం తెల్సిందే.

You may also like
కోఠిలో కాల్పులు..ఇదీ జరిగింది!
చర్యలు తీసుకోండి..పవన్ కు బిడ్డను కోల్పోయిన మహిళ వినతి
ఈ సైకిల్ పై బాబు రయ్ రయ్!
ఎన్నికల బరిలో గల్వాన్ వీరుడు సంతోష్ బాబు తల్లి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions