MP Konda Vishweshwar Offered Astalakshmi Chandravanka Gold Ornament To Tirumala | తిరుమల శ్రీవారికి ఖరీదైన కానుకను అందించారు తెలంగాణ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి.
మంగళవారం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆ తర్వాత శ్రీవారికి అష్టలక్ష్మీ చంద్రవంక కంఠి విరాళంగా అందించారు. రూ.60 లక్షలు విలువైన 535 గ్రాముల బంగారంతో ఈ అష్టలక్ష్మీ చంద్రవంక కంఠిని తయారు చేయించారు.
ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో స్వయంగా అష్టలక్ష్మీ చంద్రవంక కంఠిని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరిలకు అందజేశారు. అనంతరం అదనపు ఈవో ఈ ఆభరణాన్ని అప్పగించారు.









